HomeతెలంగాణEthanol factory | గద్వాల జిల్లాలో ఉద్రిక్తత.. ఇథనాల్​ ఫ్యాక్టరీ యాజమాన్యం వాహనాలకు నిప్పు

Ethanol factory | గద్వాల జిల్లాలో ఉద్రిక్తత.. ఇథనాల్​ ఫ్యాక్టరీ యాజమాన్యం వాహనాలకు నిప్పు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ethanol factory | జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఇథనాల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం(Government) అనుమతి ఇచ్చింది. అయితే కొంతకాలంగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఫ్యాక్టరి పెట్టమని మూడు నెలల క్రితం యాజమాన్యం చెప్పింది. అయితే రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు.

Ethanol factory | రణరంగంగా మారిన గ్రామం

గ్రామంలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు మంగళవారం రాత్రి యాజమాన్యం భారీ యంత్రాలతో వచ్చింది. విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మిస్తున్న స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళన హింసాత్మకంగా మారింది. ప్రజలు ఫ్యాక్టరీ ఇథనాల్‌ కంపెనీ(Ethanol Company)కి చెందిన కార్లు, టెంట్లను తగులబెట్టారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్‌ డబ్బాలకు రైతులు(Farmers) నిప్పు పెట్టారు. దీంతో అక్కడ వాతావరణం రణరంగంగా మారింది. కంపెనీ పనులు చేయడానికి వచ్చిన కూలీలను కూడా ప్రజలు అక్కడి నుంచి తరిమేశారు.
కంపెనీ వద్ద ఆందోళన చేస్తారనే సమాచారం ఉండటంతో ముందస్తుగా పోలీసులు(Police) మొహరించారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో వారు కూడా ఏమి చేయలేకపోయారు. దీంతో రైతులు, ప్రజలు కంపెనీ వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు టెంట్లకు నిప్పు పెట్టారు.

Must Read
Related News