HomeతెలంగాణChanchalguda Jail | చంచల్​గూడ జైల్లో ఉద్రిక్తత.. ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ

Chanchalguda Jail | చంచల్​గూడ జైల్లో ఉద్రిక్తత.. ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ

చంచల్​గూడ సెంట్రల్​ జైలులో ఇద్దరు రౌడీ షీటర్లు ఘర్షణ పడ్డారు. పాత కక్షల నేపథ్యంలో జాబ్రీ అనే వ్యక్తిపై దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chanchalguda Jail | చంచల్​గూడ జైలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరు రౌడీ షీటర్ల (Rowdy sheeters) మధ్య ఘర్షణ జరగ్గా.. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

దస్తగిరి అనే రౌడీ షీటర్​ ఇప్పటికే జైలులో ఉన్నాడు. జాబ్రీ అనే రౌడీ షీటర్​ ఓ కేసులో రిమాండ్​ నిమిత్తం మంగళవారం జైలుకు వచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. అవి మనసులో పెట్టుకొని జాబ్రీని జైలులో చూడగానే.. అతనిపై దస్తగిరి దాడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ములాఖాత్ రూములోని అద్దాలు ధ్వంసం అయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం జైలు సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జైలు లోప‌ల‌, బ‌య‌ట హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. జాబ్రీని గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)కి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించారు. కాగా జైలులో గతంలో కూడా పలువురు ఖైదీలు ఘర్షణలకు పాల్పడ్డారు.

Must Read
Related News