Homeజిల్లాలునిజామాబాద్​Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారులు వేధిస్తున్నారని నిరసిస్తూ ఓ రైతు గడ్డిమందు తాగాడు.. వివరాల్లోకి వెళ్తే.. బైరాపూర్​ గ్రామంలో కొన్నిరోజులుగా పోడు భూములను సాగు చేస్తున్నారనే సమాచారంతో మంగళవారం అటవీశాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు.

భూముల్లో సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేసేందుకు ఫారెస్ట్​ అధికారులు గడ్డిమందును తమ వెంట తీసుకెళ్లారు. దీంతో అధికారులను గ్రామంలోకి రానీయకుండా రైతులు నిరసన తెలిపారు.

Forest Department | గడ్డిమందు తాగిన రైతు..

ఫారెస్ట్​ అధికారులు, రైతులకు వాగ్వాదం చోటు చేసుకోగా.. ఇదే సమయంలో ఓ రైతు అధికారులు తీసుకొచ్చిన గడ్డిమందు తాగాడు. దీంతో అతడిని ఫారెస్ట్​ అధికారులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని జీజీహెచ్​కు (GGH Nizamabad) తరలించారు. కొన్నేళ్లుగా తాము పోడుభూములను సాగు చేసుకుంటున్నామని.. ఫారెస్ట్​ అధికారులు తమను వేధించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై ఫారెస్ట్​ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని వారు నిరసన తెలిపారు.

పురుగుల మందు తాగిన రైతును ఆస్పత్రికి తరలిస్తున్న గ్రామస్థులు

బైరాపూర్​ గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత