అక్షరటుడే, వెబ్‌డెస్క్: YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్(YS Jagan) బుధవారం బయలు దేరారు. అయితే ఇటీవల రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బంగారుపాళ్యం పర్యటన(Bangurapalyam Tour)కు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.
YS Jagan | భారీగా తరలివచ్చిన శ్రేణులు
జగన్ పర్యటనలో అనుమతులు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ మణికంట(SP Manikanta) పేర్కొన్నారు. రోడ్ షోకు అనుమతి లేదని, 500 మంది మామిడి రైతులతో మాట్లాడటానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జన సమీకరణ, ర్యాలీలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ క్రమంలో ఆయన పర్యటనకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా భారీగా కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చాయి. దీంతో బంగారుపాళ్యంలో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జీ(Police Lathi Charge) చేశారు. దీతో జగన్ కాన్వాయ్ నుంచి దిగేందుకు యత్నించారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని కారు దిగి గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునాడు. కాగా బంగారుపాళ్యం చేరుకున్న జగన్ కాసేపట్లో మార్కెట్ యార్డులో మామిడి రైతులతో(Mango Farmers) మాట్లాడనున్నారు.
YS Jagan | ఆటంకాలు సృష్టిస్తున్నారు
జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఆరోపించారు. జగన్ కోసం వచ్చిన ప్రజలపై లాఠీఛార్జ్ చేశారన్నారు. రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పార్టీ శ్రేణులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.