అక్షరటుడే, వెబ్డెస్క్: YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొగాకు రైతులకు(tobacco farmers) మద్దతుగా బుధవార వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు(TDP Leaders), మహిళలు జగన్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జగన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల ‘సాక్షి’ డిబేట్లో అమరావతి(Amaravathi) మహిళల గురించి అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలపై జగన్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
నల్ల బెలూన్లు, ప్లకార్డులతో మహిళల నిరసన తెలిపారు. కాన్యాయ్పైకి కొందరు మహిళలు చెప్పులు విసిరారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు(YSRCP Leaders) రాళ్ల దాడి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ పోలీస్ కానిస్టేబుల్(Police Constable)కి గాయాలు కాగా.. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు మహిళలు సైతం గాయపడ్డారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
YS Jagan | దాడిని ఖండించిన మంత్రి లోకేశ్
పొదిలిలో వైసీపీ సైకోల దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి లోకేష్(Minister Lokesh) తెలిపారు. మహిళలు, పోలీసులపై దాడులు చేయడం దారుణమని ఆయన అన్నారు. దాడి చేసినవారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.