156
అక్షరటుడే, డిచ్పల్లి: Dharmaram | పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) భాగంగా డిచ్పల్లి మండలంలోని ధర్మారంలో (Dharmaram village) ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డిచ్పల్లి మండలంలోని ధర్మారంలో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జరిగింది. అయితే ఓ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రత్యర్థి వర్గం ప్రజలు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకువచ్చారు.
Dharmaram | అప్రమత్తమైన పోలీసులు
దీంతో అప్రమత్తమైన డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్, కానిస్టేబుళ్లు వారిని బయటకు పంపించేశారు. అయినప్పటికీ వారంతా పోలింగ్ కేంద్రం బయట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండడంతో వారందనిరి అక్కడినుంచి చెదరగొట్టారు. అనంతరం పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూశారు.