అక్షరటుడే, వెబ్డెస్క్ : Film Chamber | హైదరాబాద్ నగరంలోని తెలుగు ఫిలిం చాంబర్ (Telugu Film Chamber) వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు తెలంగాణ వాదులు ఛాంబర్లోనికి చొచ్చుకు వెళ్లడానికి యత్నించారు. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ నటుల (Telangana actors) ఇండస్ట్రీలో వివక్ష చూపుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదరిగి, పలువురు తెలంగాణ వాదులు ఆందోళన చేపట్టారు. ఛాంబర్లోని నిర్మాత మండలిలోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఫిలి ఛాంబర్ సెక్రెటరీతో (Film Chamber Secretary) వారు వాగ్వాదం చేశారు. ఆఫీసులో తెలంగాణకు చెందిన పైడి జయరాజు ఫొటో చిన్నదిగా పెట్టారని, సినారె ఫొటో పెట్టలేదని ఆందోళన చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
ఈ సందర్భగంగా పైడి జయరాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ వాళ్ల ఫొటోలు చిన్నవిగా పెట్టారన్నారు. ప్రశ్నిస్తే తమను లాగి పారేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కులతత్వం, ప్రాంతీయ తత్వం ఉందని ఆయన ఆరోపించారు.