అక్షరటుడే, మెండోరా: Pochampad School | మెండోరా మండలం పోచంపాడ్ సాంఘిక సంక్షేమ పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
Pochampad School | అస్వస్థతకు గురవడంతో..
వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయిలిఖిత ఇటీవల అస్వస్థతకు గురైంది. దీంతో విద్యార్థినిని నిర్మల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తీసుకెళ్లారు. అయితే విద్యార్థిని చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు బుధవారం పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థిని మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఫుడ్ పాయిజన్తో పాటు డెంగ్యూ వల్ల విద్యార్థి చనిపోయిందని బంధువులు ఆరోపించారు. కాగా.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బంధువులను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. ఈ క్రమంలో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.