Homeక్రీడలుTennis Player | అంతర్జాతీయ టెన్నిస్​ క్రీడాకారిణి రాధికా యాదవ్ దారుణ హత్య.. కేవలం ఆ...

Tennis Player | అంతర్జాతీయ టెన్నిస్​ క్రీడాకారిణి రాధికా యాదవ్ దారుణ హత్య.. కేవలం ఆ కారణంతో తండ్రి చేతిలోనే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tennis Player | Radhika Yadav : భారత టెన్నిస్​ లోకానికి తీరని లోటు ఏర్పడింది. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (International tennis player Radhika Yadav) హత్యకు గురైంది. గురుగ్రామ్‌(Gurugram)లోని సుశాంత్ లోక్-2లో ఈ ఘటన జరిగింది. దారుణ విషయం ఏమిటంటే.. ఆమెను తన తండ్రే ఘోరంగా కాల్చి చంపాడు.

తన నివాసంలో రాధికపై ఆమె తండ్రి తన లైసెన్స్ రివాల్వర్‌తో మూడు బుల్లెట్లు పేల్చాడు. గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడైన రాధిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tennis Player | రీల్స్ వల్లనే..

పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధిక రీల్స్ (reels) చేస్తుందన్న ఒకే కారణంతో ఆమెపై పగ పెంచుకున్న తండి ఈ ఘాతుకానికి పాల్పడ్డాట. రాధిక తరచూ రీల్స్ చేస్తుండేది. వాటిని సామాజిక మాధ్యమాల్లో (social media) అప్​లోడ్​ చేస్తుండేది. అయితే ఇది ఆమె తండ్రికి ఇష్టం లేదు. అందుకే ఆమెపై ఆగ్రహంతో రగిలిపోయాడు.

ఇంట్లో అదును చూసి రాధికపై ఆమె తండ్రి రివాల్వర్​తో విరుచుపడ్డాడు. ఆమెపై మూడు బుల్లెట్లు పేల్చాడు. దీంతో రాధిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కేవలం రీల్స్ చేస్తుందన కారణంతో ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిని ఆమె తండ్రే అత్యంత కిరాతకంగా చంపడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

రాధిక టెన్నిస్ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించింది. మార్చి 23, 2000న జన్మించిన రాధిక వయసు 25 ఏళ్లు.

Tennis Player | టెన్నిస్‌ఖేలో.కామ్ ప్రకారం..

ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్​లో రాధిక ర్యాంకు బాగానే ఉంది. డబుల్స్ టెన్నిస్ ప్లేయర్‌లో 113, ఐటీఎఫ్ డబుల్స్‌లో టాప్ 200లో ఉండటం విశేషం. దేశానికి చెందిన వర్థమాన క్రీడాకారిణి రాధిక టెన్నిస్ ప్రయాణం ప్రారంభంలోనే ఆమె జీవిత తండ్రి ముగించేశాడు.

Must Read
Related News