అక్షరటుడే, వెబ్డెస్క్ : Wine Shops | రాష్ట్రంలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. దీంతో చివరి రోజు భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణల టెండర్ (Liquor Store Tender) కోసం గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదట్లో దుకాణాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. గురువారం సాయంత్రం వరకు 25 వేల దరఖాస్తులే వచ్చాయి. అయితే గడువు దగ్గర పడుతుండటంతో భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. శుక్రవారం ఒక్కరోజు మొత్తం 25 వేల దరఖాస్తులు వచ్చాయి.
Wine Shops | మరో 50 వేలు వస్తాయని అంచనా..
మద్యం దుకాణాల (Wine Shops) కోసం ఇప్పటి వరకు మొత్తం 50 వేల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైనా శనివారం మరో 50 వేల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు ఫీజు రూ.మూడు లక్షలకు పెంచడంతో వ్యాపారులు మొదట ఆసక్తి ప్రదర్శించలేదు. అయితే గడువు సమీపిస్తున్న కొద్ది భారీగా దరఖాస్తులు రావడం గమనార్హం. మొత్తం లక్ష వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేసుకున్నారు. మరి ఆ మార్క్ చేరుతుందో లేదో చూడాలి.
Wine Shops | గడువు పెంచుతారా..
లక్ష్యం మేరకు దరఖాస్తులు రాకపోతే గడువు పెంచుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వం గడువు పెంచకపోవచ్చని అధికారులు అంటున్నారు. కాగా బీసీ బంద్ (BC Bandh) ప్రభావంతో చివరి రోజు దరఖాస్తులపై ఏమైనా ప్రభావం పడుతుందా అనేది తెలియాల్సి ఉంది. కాగా మద్యం వ్యాపారులు సిండికేట్గా మారడంతో తక్కువగా దరఖాస్తులు నమోదు అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని ఓ దుకాణానికి శుక్రవారం ఒకే దరఖాస్తు వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సారి గౌడ కులస్తులతో పాటు ఎస్సీ, ఎస్టీలకు సైతం మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ అమలు చేశారు. రిజర్వ్డ్ దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.