Snakes | పదేళ్ల బాలిక మెడలో రెండు కట్లపాములు.. రాత్రంతా అలాగే నిద్ర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Snakes : పాములను చూస్తే ఎవరైనా గజగజ వణుకుతారు. అవి తమని ఎక్కడ కాటేస్తాయోనని భయపడిపోతారు. అలాంటిది ప్రమాదకర విషం కలిగిన రెండు కట్ల పాములు (venomous snakes) మెడలో వేలాడితే.. అదీనూ రాత్రంగా అలాగే ఉంటే.. ఆ భయానక దృశ్యం ఊహించుకుంటేనే ఒంట్లోంచి వణుకు మొదలవుతుంది. బిహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. Snakes : బాలిక మెడలో.. రెండు పాములు గయాలోని ఫతేపుర్ పోలీస్ స్టేషన్‌ పరిధి జామ్హేటాలో […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Snakes : పాములను చూస్తే ఎవరైనా గజగజ వణుకుతారు. అవి తమని ఎక్కడ కాటేస్తాయోనని భయపడిపోతారు. అలాంటిది ప్రమాదకర విషం కలిగిన రెండు కట్ల పాములు (venomous snakes) మెడలో వేలాడితే.. అదీనూ రాత్రంగా అలాగే ఉంటే.. ఆ భయానక దృశ్యం ఊహించుకుంటేనే ఒంట్లోంచి వణుకు మొదలవుతుంది. బిహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

Snakes : బాలిక మెడలో.. రెండు పాములు

గయాలోని ఫతేపుర్ పోలీస్ స్టేషన్‌ పరిధి జామ్హేటాలో రాజు కుమార్ కేసరి కుటుంబం ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లో అంతా నిద్రపోయారు. మరునాడు ఉదయం రాజు భార్య నిద్ర నుంచి లేచి చూసేసరికి వారి కూతురు సలోని కుమారి (10) మెడలో రెండు కట్ల పాములు కనిపించాయి. ఒక్కసారి భయకంపితురాలైన ఆమె గట్టిగా అరిచింది. ఆ అరుపులకు రాజు కుమార్ నిద్రలేచాడు. కూతురు మెడలో పాములను చూసి షాకయ్యాడు.

Snakes : రాత్రంతా మెడలోనే…!

కుమార్తె కోసం రాజు తన ప్రాణాలను లెక్కచేయలేదు. వెంటనే పాప మెడలోని పాముల నోళ్లను తన చేతులతో పట్టుకున్నాడు. అలానే గట్టిగా ప్రెస్​ చేయడంతో ఆ రెండు పాములు కూడా అక్కడికక్కడే మరణించాయి. ఈ ఘటన గురించి తెలిసి గ్రామస్థులందరూ షాక్​ అయ్యారు. పాప మెడలో రాత్రంతా ఆ రెండు పాములు ఉన్నట్లు రాజు చెబుతున్నారు.

పాములను చంపిన తర్వాత రాజు తన పాప సలోనిని ఫతేపుర్ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. తండ్రీ కూతురు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరు కూడా విషం బారిన పడలేదు. వైద్యులు ముందు జాగ్రత్త చర్యగా తండ్రీకూతురును పరీక్షల కోసం గయా మగధ్ మెడికల్ కాలేజీకి పంపారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

February 24 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

February 24 Panchangam | తేదీ (DATE) – ఫిబ్రవరి 24,​ 2026 పంచాంగం (today horoscope) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

Second edition CM Cup | సెకండ్​ ఎడిషన్​ సీఎం కప్​ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు.. ప్రతిభ చూపిన కాకతీయ ఒలంపియాడ్​ విద్యార్థిని

అక్షరటుడే, ఇందూరు: Second edition CM Cup | హైదరాబాద్​లోని సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో ఈనెల 20 నుంచి సెకండ్ ఎడిషన్ సీఎం కప్...

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల...