HomeUncategorizedAhmadabad Plane Crash | పది నిమిషాలు ఆలస్యం.. యువతి ప్రాణాలు కాపాడింది

Ahmadabad Plane Crash | పది నిమిషాలు ఆలస్యం.. యువతి ప్రాణాలు కాపాడింది

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ahmadabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) గురువారం మధ్యాహ్నం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఓ యువతి కొద్ది నిమిషాల ఆలస్యంతో తప్పించుకుంది.

గుజరాత్‌లోని భరూచ్ ప్రాంతానికి చెందిన భూమి చౌహాన్ నిన్న ఎయిర్​ ఇండియా విమానంలో లండన్​(London) వెళ్లాల్సి ఉంది. విమానం బయలు దేరాల్సిన సమయం 1:10 గంటలకు ఉంది. భూమి 12:20 నిమిషాలకు ఎయిర్​పోర్ట్​కు చేరుకుంది. అయితే ఎయిర్​పోర్టు అధికారులు 12:10 గంటలకే చెక్​ ఇన్​ మూసి వేశారు. గంట ముందుగానే ప్రయాణికులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు. ఈ క్రమంలో ఆలస్యం అయినందుకు భూమి చౌహాన్​ను అధికారులు అనుమతించలేదు. అమె అధికారులను బతిమిలాడినా రూల్స్​ ఒప్పుకోవు అని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆమె వెను తిరిగారు. అయితే విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే కూలిపోయిందనే విషయం తెలియడంతో ఆమె షాక్​కు గురయ్యారు.

Ahmadabad Plane Crash | ఆ దేవుడే కాపాడాడు..

ప్రమాద ఘటన గురించి తలుచుకుంటూ ఇంకా శరీరం వణుకుతోందని భూమి చౌహన్​ అన్నారు. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్​లో చిక్కుకోవడంతో తాము పది నిమిషాలు ఆలస్యంగా ఎయిర్​పోర్టు(Airport)కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. ప్రమాద విషయం తెలియగానే షాక్​కు గురైనట్లు ఆమె తెలిపారు. ‘‘నా మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. ఆ గణపతి బప్పే నన్ను కాపాడాడు’’ అని భూమి అన్నారు. కాగా.. లండన్‌లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్‌ రెండేళ్ల అనంతరం వెకేషన్‌ కోసం ఇండియా వచ్చింది. తిరిగి వెళ్లాలనుకునే సమయంలో ఆలస్యంతో విమానం ఎక్కలేక ప్రాణాలతో బయటపడింది.