ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Lunar Eclipse | చంద్ర గ్రహణం వేళ నగరంలో ఆలయాల మూసివేత

    Lunar Eclipse | చంద్ర గ్రహణం వేళ నగరంలో ఆలయాల మూసివేత

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Lunar Eclipse | సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం ఉదయం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయం (Neelkantheshwara Temple), జెండా బాలాజీ (jenda balaji) ఆలయాన్ని పూజారులు మూసివేశారు.

    ఖిల్లా రామాలయం (Khilla ramalayam), అయ్యప్ప దేవాలయం (Ayyappa alayam), శంభుని గుడి(Shambuni gudi), బోధన్ చక్రేశ్వరాలయం (Bodhan Chakraswara Temple), ఆర్మూర్ సిద్దులగుట్ట (Sidhula gutta), సారంగాపూర్ హనుమాన్ (Sarangapur), గోల్ హనుమాన్ తదితర ఆలయాలను ఉదయం పూజలు నిర్వహించిన అనంతరం మూసి వేశారు.

    తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుందని వేద పండితులు తెలిపారు. సుమారు మూడు గంటల పాటు గ్రహణం పడుతుందని, సంపూర్ణ చంద్రగ్రహణం కనబడుతుందని పేర్కొన్నారు.

    Lunar Eclipse | చంద్ర గ్రహణం అంటే..

    భూమి, సూర్యుడు, చంద్రుడు(Moon) ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన. గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడడం వల్ల చంద్రుడు కనిపించడు. లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ సంఘటనకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితి, భావోద్వేగాలు, ప్రశాంతతను సూచిస్తాడు. ఈసారి చంద్రగ్రహణం ఆసియా ఖండంలోని భారత్‌(Bharath)తో సహా రష్యా, సింగపూర్‌, చైనా వంటి దేశాల్లో కనబడనుంది.

    Lunar Eclipse | సూతక కాలంలో ఏం చేయాలి?

    హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం విడిచేంతవరకు ఉండే సమయాన్ని సూతక కాలంగా పరిగణిస్తారు. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు. ఎలాంటి పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి తలుపులు తెరిచి పూజలు చేస్తారు. రాహుకేతు(Rahu Ketu) పూజలు జరిగే ఆలయాలు మాత్రం గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటాయి.

    Lunar Eclipse | ఏ నియమాలు పాటించాలంటే…

    సనాతన ధర్మాన్ని(Sanatana Dharmam) ఆచరించే వారు సాయంత్రం 6 గంటలలోపు భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని, గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదని పేర్కొంటున్నారు. అలాగే చంద్ర గ్రహణం(Chandra Grahanam) సమయంలో నిద్రపోవద్దని శాస్త్రం చెబుతోంది.
    గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భ లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందన్నది ప్రజల నమ్మకం.
    చంద్ర గ్రహణ సమయంలో ధ్యానం, జపం వంటివి ఆచరించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు ఈ చంద్ర గ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. చాలామంది గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేస్తారు. గ్రహణ పట్టు, విడుపు స్నానాలు ఆచరించడం వల్ల గ్రహణ దోషాలు అంటకుండా ఉంటాయని నమ్ముతారు.

    Lunar Eclipse | దానాలు శ్రేష్టం..

    చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. ఈ సందర్భంగా శక్తిమేరకు వస్త్రాలు, ఆహారం, డబ్బు దానం చేయాలి. గ్రహణ సమయంలోనూ, ఆ తర్వాతా చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం, బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని ప్రజలు నమ్ముతారు.

    జెండాబాలాజీ మందిరాన్ని మూసివేసిన ఆలయ పూజారులు, అధికారులు, ధర్మకర్తలు

    నగరంలో మూసివేసిన గోల్​హన్మాన్​ ఆలయం

    నగరంలోని శంభుని గుడిని మూసివేస్తున్న పూజారులు, ఆలయ ధర్మకర్తలు

    More like this

    Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం

    అక్షరటుడే, బోధన్​: Transco | నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ట్రాన్స్​కో ఆపరేషన్స్​(Transco Operations) డీఈ ఎండీ ముక్తార్...

    Japan Prime Minister | త‌ప్పుకోనున్న జ‌పాన్ ప్ర‌ధాని.. పార్టీలో విభేదాల‌తో రాజీనామాకు నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Japan Prime Minister | జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా (Japan Prime Minister...

    ​ Bheemgal | ఇసుకను అక్రమంగా తవ్వుతున్న వ్యక్తులపై కేసు నమోదు

    అక్షరటుడే, భీమ్​గల్: ​ Bheemgal | మండలంలో బెజ్జోర గ్రామ శివారులో కప్పలవాగు (Kappalavaagu) నుండి ఇసుకను అక్రమంగా...