అక్షరటుడే, ఇందూరు: Karthika Masam | కార్తీక పౌర్ణమిని (Kartikల Purnima) పురస్కరించుకొని జిల్లాలోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపారాధనలు చేశారు. నగరంలోని కంఠేశ్వరాలయం (Kanteshwar Temple), ఉమామహేశ్వర ఆలయం, శంభుని గుడి, నగరేశ్వరాలయాల్లో మహిళలు పిండి దీపాలు వెలగించారు.
Karthika Masam | బోధన్, ఆర్మూర్, బాల్కొండలలో..
బోధన్ చక్రేశ్వరాలయం (Bodhan Chakraswara Temple), ఆర్మూర్ సిద్దుల గుడిలో, బాల్కొండలో వేకువజామున నుంచి దీపాలను వెలిగించారు. అలాగే ఉసిరి దీపాలను పురోహితులకు దానం చేశారు. సాయంత్రం వేళ దీపాల వెలుతురులో ఆలయాలు వెలిగిపోయాయి. ఇళ్లలో తులసీ దామోదర కల్యాణంతో పాటు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు




