అక్షరటుడే, ఇందూరు : New Year Celebrations | నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడిజిల్లాలో పలు దేవాలయాలకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆయా ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబసమేతంగా భక్తులు వెళ్లి తమ మొక్కులు తీర్చుకున్నారు.
New Year Celebrations | నగరంలో..

నగరంలోని నీలకంఠేశ్వరాలయం (Neelakanteswara Temple)లో భక్తుల నూతన ఏడాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే భక్తుల కోసం ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అలాగే శంభునిగుడి, చక్రం గుడి, మాధవనగర్ (Madhavanagar) సాయిబాబా ఆలయాలు భక్తుల రాకతో సందడిగా మారాయి.
New Year Celebrations | ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి..

నూతన సంవత్సరం, వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ హనుమాన్ (Jubilee Hills Hanuman), శివాలయాలను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (MLA Prashanth Reddy) దంపతులు దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకొన్నారు.