అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | దేవాలయ భూములను కాపాడాలని దేవాలయ పరిరక్షణ సమితి (Devalaya parirakshna Samithi) జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రసాద్ కోరారు.
సర్వ సమాజ కమిటీ (Surva samaj Committee) అధ్యక్షుడు యెండల లక్ష్మీ నారాయణకు (yendala laxmi narayana) శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని పెద్ద రాంమందిర్ భూములను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అలాగే కంఠేశ్వర్ (Kanteshwar), శంభుని గుడికి ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే శంభుని గుడికి (Shambuni Gudi) ఆనుకొని ఉన్న చెప్పుల దుకాణం తొలగింపజేశామని వివరించారు. సర్వసమాజ్ కమిటీ, హిందూ సమాజం తమకు సహకరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ఊర పండుగ (Ura panduga) కమిటీ అధ్యక్షుడు రామర్తి గంగాధర్, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు దత్తాత్రి, హమాలీ సంఘం అధ్యక్షుడు పరుశురాం, ముదిరాజ్ సంఘం గౌరవాధ్యక్షుడు గోపాల్, ఆయా సంఘాల నాయకులు ప్రవీణ్, రాజు, సుభాష్, లక్ష్మణ్, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.