అక్షరటుడే, ఆర్మూర్: Donkeshwar | డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ (Armoor Constituency) కాంగ్రెస్ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి (Congress in-charge Poddaturi Vinay Kumar Reddy) పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ డొంకేశ్వర్ మండలాధ్యక్షుడు భూమేష్ రెడ్డి, మండల నాయకులు సుమన్, జలపతి రావ్, నందిపేట్ (Nandipet) మండలాధ్యక్షుడు మంద మహిపాల్, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ (Armoor Market Yard) వైస్ ఛైర్మన్ ఇస్సాపల్లి జీవన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్, మారుతి రెడ్డి, మురళి పాల్గొన్నారు.
Donkeshwar | వైభవంగా లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన
Published on
