అక్షరటుడే, వెబ్‌డెస్క్: heroine Samantha : తన ఆరాధ్య నటి కోసం ఓ వీరాభిమాని ఏకంగా గుడి కట్టించాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆలయాన్ని ప్రారంభించడంతో పాటు స్థానికులకు అన్నదానం కూడా చేశాడు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. బాపట్లలోని ఆలపాడుకు చెందిన సందీప్నకు హీరోయిన్ సమంత రుతుప్రభు అంటే చచ్చేంత అభిమానం. సామ్‌ను అమితంగా ఆరాధించే సందీప్ ఆమె కోసం గుడి కట్టించాడు. ఏప్రిల్ 28న సమంత 38వ పుట్టినరోజున దానిని ఆమెకు అంకితం చేశాడు. ‘ది టెంపుల్ ఆఫ్ సమంత’ అని పిలిచే ఆలయంలో అనాథలకు ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశాడు.
heroine Samantha : వీరాభిమానంతో..
సందీప్ కట్టించిన ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారింది. ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న ఆయా వీడియోల్లో సమంత కోసం కట్టించిన ఆలయం మధ్యలో రెండు విగ్రహాలు కనిపిస్తాయి. ఆమె పుట్టినరోజు కోసం ఆలయాన్ని పూలతో అలంకరించారు. సందీప్ అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశాడు. పిల్లలకు అక్కడే భోజనం ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ తాను సమంతకు పెద్ద అభిమానిని అని చెప్పాడు. మూడేళ్లుగా ఆమె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నానని తెలిపాడు. సామ్ దాతృత్వం తనకెంతో స్ఫూర్తి అని, ఆమె అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నానని చెప్పాడు.