అక్షరటుడే, వెబ్‌డెస్క్ : South Africa | దక్షిణాఫ్రికాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల ఆలయం కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికాలోని (South Africa) క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లో కొండపై ఉన్న న్యూ అహోబిలం టెంపుల్ (New Ahobilam Temple) నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం జరుగుతుండగా.. కూలిపోయింది. కార్మికులు అక్కడ ఉండగానే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. అయితే భారీగా శిథిలాల కింద కార్మికులు చిక్కుకోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శనివారం వరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.
South Africa | సహాయక చర్యలు
భవనం కూలడంతో భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. దీంతో ఆదివారం సైతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. శిథిలాల పలువురు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా.. మరణించిన వారిలో ఒకరిని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జైరాజ్ పాండేగా గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి ఆలయ అభివృద్ధిలో పాండే పాలు పంచుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.
రియాక్షన్ యూనిట్ దక్షిణాఫ్రికా ప్రతినిధి ప్రేమ్ బలరామ్ మాట్లాడుతూ.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో నిర్ధారించలేం అన్నారు. భారత్ నుంచి తెచ్చిన రాళ్లను ఉపయోగించి గుహను పోలి ఉండేలా ఆలయాన్ని రూపొందించారు మరియు ఆ ప్రదేశంలో తవ్వారు, మరియు ఈ నిర్మాణాన్ని నిర్మిస్తున్న కుటుంబం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నరసింహదేవుడి (Narasimha Swamy) దేవతలలో ఒకరిని కలిగి ఉంటుందని పేర్కొంది.
ఈథెక్విని మునిసిపాలిటీ ఒక ప్రకటనలో, ఈ ప్రాజెక్ట్ కోసం ఎటువంటి భవన ప్రణాళికలు ఆమోదించబడలేదని, నిర్మాణం చట్టవిరుద్ధమని సూచించింది. చిక్కుకున్న వ్యక్తులలో ఒకరి సెల్‌ఫోన్ కాల్స్ ద్వారా ప్రారంభ సహాయక చర్యలు జరిగాయి. కానీ శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా కమ్యూనికేషన్లు ఆగిపోయాయని అధికారులు తెలిపారు. క్వాజులు-నాటల్ ప్రావిన్షియల్ కోఆపరేటివ్ గవర్నెన్స్ మరియు ట్రెడిషనల్ అఫైర్స్ మంత్రి తులసిజ్వే బుథెలెజీ శనివారం ఆ ప్రదేశాన్ని సందర్శించి, అవసరమైనంత కాలం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. అయితే ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని నిపుణులు గుర్తించారు. వెస్ట్రన్ కేప్ నుండి ప్రత్యేక డాగ్ యూనిట్‌తో సహా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సంయుక్త ప్రభుత్వ మరియు ప్రైవేట్ బృందాలకు బుథెలెజీ కృతజ్ఞతలు తెలిపారు.
South Africa | నలుగురు మృతి
ఈ ఘటనలో 52 ఏళ్ల భారత సంతతి వ్యక్తి (Indian origin man) సహా నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టతలేదన్నారు.
దీంతో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. టన్నులకొద్దీ శిథిలాలు ఉండటంతో.. వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రమాదంలో మరణించిన భారత సంతతి వ్యక్తిని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జైరాజ్ పాండేగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. దాదాపు రెండేళ్లుగా ఆయన ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.