ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    Weather Updates | రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Weather Updates | గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం మళ్లీ వేడెక్కనుంది.

    ఈ సారి అకాలు వర్షాలు, నైరుతి రుతుపవానాలు (Southwest monsoon) ముందుగానే రావడంతో మే నెలలోనే వానలు దంచికొట్టాయి. దీంతో ఎండలు మండాల్సిన మే నెలలో వరదలు పారి వాతావరణం చల్లబడింది. అయితే శనివారం నుంచి రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది.

    రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(Telangana)లో 38 నుంచి 39 డిగ్రీల టెంపరేచర్​ నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్(Hyderabad)​లో 35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్నారు.

    Weather Updates | రైతన్నలు బిజీబిజీ

    గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలు శుక్రవారం నుంచి కాస్త తెరిపినిచ్చాయి. దీంతో రైతులు (Farmers on cultivation) వానాకాలం సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కులు దున్ని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. తుకం మడులను తయారు చేస్తున్నారు. మరోవైపు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో విత్తన దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...