HomeUncategorizedTelusu Kada Teaser | ఈ సారి ఇద్ద‌రు అమ్మాయిల‌తో రొమాన్స్‌కి రెడీ అయిన సిద్ధు.....

Telusu Kada Teaser | ఈ సారి ఇద్ద‌రు అమ్మాయిల‌తో రొమాన్స్‌కి రెడీ అయిన సిద్ధు.. హైప్స్ పెంచిన తెలుసు క‌దా టీజ‌ర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telusu Kada Teaser | డీజే టిల్లు చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన యువ హీరో సిద్దు జొన్నలగడ్డ. ప్ర‌స్తుతం ఈ కుర్ర హీరో ప్ర‌ధాన పాత్ర‌లో ‘తెలుసు కదా’ అనే చిత్రం రూపొందుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను అధికారికంగా విడుదల చేస్తూ, ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది చిత్రబృందం. టీజర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. టీజర్‌లో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తనదైన స్టైల్‌లో ఆక‌ట్టుకున్నాడు. వైవిధ్యమైన డైలాగ్ డెలివరీ, కామ్-యెట్-క్లాసీ స్టైల్, ఎమోషనల్ టోన్తో ఆకట్టుకున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, ఉల్లాసం మేళవింపుతో టీజ‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

Telusu Kada Teaser | హైప్ పెంచారుగా..

‘తెలుసు కదా’ (Telusu Kada) సినిమాను అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. టీజర్‌తో ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లనున్నారు. నీరజ్ కోన ద‌ర్శ‌క‌త్వంలో (Director Neeraj Kona) రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పనిచేస్తుండటంతో సంగీతం కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ సినిమాలో సిద్దుకు జోడీగా ఇద్ద‌రు ప్రముఖ కథానాయికలు నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఇందులో గ్లామర్‌తో పాటు త‌న పవ‌ర్ ఫుల్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకోబోతుంది.

ఇక తన చిలిపితనంతో పాటు, భావోద్వేగాలతో క‌ట్టిప‌డేసే రాశీ ఖ‌న్నా (Raashi Khanna) కూడా ఇందులో నటిస్తుంది. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి యువరాజ్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. టీజ‌ర్ చూస్తుంటే మూవీపై చాలా ఆస‌క్తి క‌లుగుతుంది. మ‌రి ఈ చిత్రంతో సిద్ధు ఎలాంటి హిట్ కొడ‌తాడో చూడాలి.