అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిఖిత గొడిశాల (27) అనే యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. మేరీలాండ్ (Maryland)లో ఉన్న కొలంబియాలో ఆమె వారం రోజుల నుంచి కనిపించడం లేదు.
న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) అనంతరం కనిపించకుండా పోయినట్లు సమాచారం. తాజాగా ఆమె మృతదేహాన్ని పోలీసులు ఆమె మాజీ ప్రియుడు అర్జున్ అపార్ట్మెంట్లో గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
America | పోలీసులకు ఫిర్యాదు
నిఖిత ప్రస్తుతం హోవర్డ్ కౌంటీ (Howard County)లో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్ (Strategy Analyst)గా పనిచేస్తుంది. ఆమె కనిపించడం లేదని ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అతడు పరారు అయ్యాడు. అయితే మేరీల్యాండ్ సిటీలోని అర్జున్‌శర్మ ఫ్లాట్‌లో ఆమె డిసెంబర్ 31న చివరిసారి కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి ప్లాట్లో తనిఖీ చేయగా.. హత్య విషయం వెలుగు చూసింది. అర్జున్ శర్మనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అయితే అతడు భారత్కు వచ్చినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా నిఖిత హైదరాబాద్ (Hyderabad)నగరంలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా సమాచారం.