అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telugu Student Death Compensation | అమెరికా (America)లో మృతి చెందిన తెలుగు విద్యార్థి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించడానికి సియాటెల్ అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
ఏపీలోకి కర్నూల్ (Kurnool) జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (Kandula Jahnavi) ఉన్నత విద్య కోసం 2021లో అమెరికాకు వెళ్లింది. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరింది. అయితే 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడిక్కడే మృతి చెందింది. అయితో పెట్రోలింగ్ కారు నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ఆయన అతివేగంగా రావడంతో ఘటన చోటు చేసుకుంది. ఆ రోడ్డులో స్పీడ్ లిమిట్ 40 కి.మీ. కాగా.. ఆయన 119 కి. మీ. వేగంతో వచ్చి జాహ్నవిని ఢీకొట్టాడు.
Telugu Student Death Compensation | తీవ్ర విమర్శలు
జాహ్నవి మృతి అనంతరం సదరు పోలీసు అధికారు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆమె సాధారణ వ్యక్తి.. మరణానికి విలువ లేదని కెవిన్ డవే (Kevin Davey) అన్నారు. ఈ మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై అమెరికాలో విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం సైతం అభ్యంతం వ్యక్తం చేసింది. దీంతో ఆయనను అధికారులు విధుల నుంచి తొలగించారు. ఈ కేసు విచారణలో భాగంగా జాహ్నవి కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్లు) పరిహారం ఇవ్వడానికి సియాటెల్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. దీనిపై జాహ్నవి కుటుంబం స్పందించలేదు.