అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌తో భారత్(India) పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాకుండా పాక్ దాడులను(Pakistan Attacks) భారత్ తిప్పి కొడుతోంది. దీంతో పాకిస్తాన్ ఎల్వోసీ(LOC) వెంబడి నిత్యం కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరులే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. అయితే పాక్ కాల్పులను భారత బలగాలు(Indian Forces) తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ కాల్పుల్లో భారత జవాన్ మురళీనాయక్(Indian soldier Murali Naik) మృతి చెందాడు. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా కల్లి తండా. రేపు మురళీనాయక్ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు(Army Officers) స్వగ్రామానికి తీసుకు రానున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.