అక్షరటుడే, వెబ్‌డెస్క్: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1) మలేసియా తెలుగు ఫౌండేషన్ Telugu Foundation ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
మలేసియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక తెలుగు సంఘాల భాగస్వామ్యంతో “మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ” అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ వేడుకలో దేశభక్తి గీతాలు, సంగీత విభావరి ఆహూతులను అలరించాయి. ఈ వేడుక మలేసియాలోని తెలుగు ప్రజల్లో ఉత్సాహం నింపింది.
మలేసియాలో తెలుగు ఫౌండేషన్, తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్, తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ, పెళ్లిచూపులు అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్స్(FNCA), భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేసియా వంటి ఎన్ఆర్ఐ NRI సంస్థలు ఈ వేడుకలో భాగస్వామ్యం అయ్యాయి.
Malaysia Independence Day | ముఖ్య అతిథిగా భారత హైకమిషనర్..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత హైకమిషనర్ బి.ఎన్. రెడ్డి హాజరయ్యారు. తెలుగు సమాజంతో తన ఆశయాలను పంచుకున్నారు. గౌరవ అతిథులుగా, మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రఖ్యాత నటుడు మురళీ మోహన్ actor Murali Mohan, ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ senior actor Pradeep కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మురళీ మోహన్ సేవల్ని గుర్తుచేస్తూ ఓ స్మరణార్థ వీడియో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. హైకమిషనర్ Indian High Commissioner బి.ఎన్. రెడ్డిని, మురళీ మోహన్, ప్రదీప్తోపాటు అన్ని కమిటీల సభ్యులను మలేసియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు డాటో కాంతారావు ఘనంగా సత్కరించారు.
ఈ వేడుకలో భాగంగా అనాథ పిల్లలకు కృతజ్ఞతాభివందనాలు, బహుమతులు అందజేయడం ద్వారా చారిటీ లక్ష్యాన్ని కూడా నెరవేర్చారు.
Malaysia’s Independence Day | సంబరంగా వేడుక..
ఈ కార్యక్రమంలో తెలుగు గాయకుల వినూత్న సంగీత ప్రదర్శనలు వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక గీతాలతో ప్రేక్షకులను అలరించారు. FNCA అధ్యక్షుడు బురెడ్డి మోహన్ రెడ్డి, భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా అధ్యక్షుడు చొప్పరి సత్య ఈ వేడుకలో పాల్గొని.. సాంస్కృతిక, సామాజిక సేవ అవసరాన్ని ప్రస్తావించారు.
“మెర్దేకా మధుర గీతాంజలి చారిటీ” కార్యక్రమం.. ఐక్యత, సంప్రదాయం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి, మలేసియాలో నివసిస్తున్న తెలుగు సమాజం తమ వారసత్వంపై గౌరవాన్ని, మలేసియాపై ప్రేమను చాటి చెప్పింది.