అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telugu Film Chamber | తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి president గా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు Daggubati Suresh Babu విజయం సాధించారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో సురేష్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో ఏడాది పాటు ఉండనున్నారు. ఉపాధ్యక్షుడిగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. కార్యదర్శిగా అశోక్ కుమార్, కోశాధికారిగా ముత్యాల రామ్ దాస్ విజయం సాధించారు.
Telugu Film Chamber | కార్యవర్గం మొత్తంగా..
ఫిలిం ఛాంబర్ ఎన్నికలను ఆదివారం (డిసెంబర్ 28) నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రొగ్రెసివ్ ప్యానల్, మన ప్యానెళ్లు పోటీ పడ్డాయి. ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి పెద్ద నిర్మాతలు, మన ప్యానల్ నుంచి చిన్న నిర్మాతలు బరిలో దిగారు. స్టూడియో సెక్టార్, ప్రొడ్యూసర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్,ఎగ్జిబిటర్స్ సెక్టార్లలో 48 మంది కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు.
ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి ప్రొగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో సురేష్ బాబు, మన ప్యానెల్ తరఫున నట్టి కుమార్ పోటీ పడ్డారు. ఇక కార్యవర్గం విషయానికి వస్తే ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది, మన ప్యానెల్ నుంచి 17 మంది విజయం సాధించారు. మొత్తంగా ప్రొగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.