అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telugu Actress | మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కొందరు ఆకతాయిలు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో (Social Media) ఇష్టం వచ్చినట్లు సందేశాలు పంపుతున్నారు. సెలబ్రెటీలను సైతం వదలడం లేదు. తాజాగా ఓ నటిపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలుగు, కన్నడ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఓ నటిని కొంతకాలంగా ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో (Facebook)వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేగా.. బెంగళూరులోని (Bangalore) అన్నపూర్ణేశ్వరి నగర్ అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘నవీన్’ అనే వ్యక్తి నుంచి సదరు నటికి ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ వచ్చింది. అయితే ఆమె దానిని రిజెక్ట్ చేసింది. దీంతో అతడు ఆమెను వేధించడం ప్రారంభించాడు. తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపుతుండడంతో నటి అతడిని బ్లాక్ చేసింది.
Telugu Actress | ఫేక్ అకౌంట్లతో..
ఆమె బ్లాక్ చేయడంతో నిందితుడు ఫేక్ అకౌంట్‌లు (Fake Account) క్రియేట్ చేసి ఆమెను వేధించడం ప్రారంభించాడు. వాటినుంచి సందేశాలు పంపుతుండడంతో ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. ఎన్ని అకౌంట్లు బ్లాక్ చేసినా వేధింపులు ఆగడం లేదని ఆమె పేర్కొంది. అతడి ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు తనకు పంపుతున్నాడని వాపోయింది. ఈ నెల 1న కూడా అతడు మెసేజ్ చేసినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Telugu Actress | జాబ్‌లో నుంచి తీసేసిన కంపెనీ
నిందితుడిని నీవన్ కే మోన్గా పోలీసులు గుర్తించారు. అతడు బెంగళూరులోని ఒక గ్లోబల్ టెక్నాలజీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పెద్ద కంపెనీలో పని చేస్తున్న అతడు నీచపు పనికి దిగజారాడు. దీంతో తోటి ఉద్యోగులు అతడిని అసహ్యించుకుంటున్నారు. సదరు కంపెనీ సైతం నవీన్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించింది. కాగా.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికల ద్వారా చాలా అసభ్యకర సందేశాలు పంపుతూ మహిళలను వేధిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
