అక్షరటుడే, ఇందూరు: Jeevan Reddy | సాకర్ దిగ్గజం మెస్సీ, గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ఒక బ్లేమ్‌గేమ్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి (Jeevan Reddy) మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Jeevan Reddy | ప్రజాసంపద దుర్వినియోగం..
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తూ రాక్షసక్రీడ ఆడుతున్నారని ఆరోపించారు. మెస్సీ ఆడేది సాకర్ గేమ్ రేవంత్ ఆడేది జోకర్ గేమ్ అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో ఓటుకు నోటు కేటుగాడు అని, రూ. కోట్లు కొల్లగొట్టేందుకే ఫుట్‌బాల్ మ్యాచ్ (football match) తీసుకొచ్చాడని దుయ్యబట్టారు.
Jeevan Reddy | హామీలు పక్కనపెట్టి.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లా..
ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడం సిగ్గుచేటని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఒకవైపు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వాటిని పట్టించుకోకుండా హంగు ఆర్భాటాలకు వెళ్తున్నాడన్నారు. సింగరేణి సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) తమ సొంతానికి వాడుకోవడం సరికాదన్నారు.
Jeevan Reddy | బీసీల ధర్నాకు రాని రాహుల్‌గాంధీ..
ఢిల్లీలో జరిగిన బీసీల ధర్నాకు రావడానికి తీరికలేని రాహుల్ గాంధీ ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించేందుకు స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ రావడం ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ దిశగా ఉండేదని కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభ తెలంగాణగా మారిందన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలకు నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్, సీనియర్ నాయకుల ప్రభాకర్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.