అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nitin Gadkari | జాతీయ రహదారుల National Highways తో తెలంగాణ Telangana దశ తిరుగుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ Nitin Gadkari అన్నారు. రూ.3,694 కోట్లతో నిర్మించిన 5 జాతీయ రహదారులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ Kagaz Nagar నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల పరిస్థితులు మారాలంటే విద్య education ఒక ఆయుధం అన్నారు. తెలంగాణను అమృత సరోవరం తయారు చేసి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి తెలంగాణ సీఎం, మంత్రులు తమతో కలిసి రావాలని గడ్కరీ కోరారు.
ప్రాజెక్ట్‌లలో పూడికలు తీసి పంటలు పండేలా చేద్దామన్నారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ములుగు-కొత్తగూడెం మధ్య హైవే నిర్మాణం జరుగుతోందని చెప్పారు. పవర్, పాస్‌పోర్ట్, కమ్యూనికేషన్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన వివరించారు. తెలంగాణలో గ్రీన్ హైవేల నిర్మాణం వేగంగా జరుగుతోందని, కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలుపుతూ రోడ్లు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.
Nitin Gadkari | కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం
కశ్మీర్ Kashmir నుంచి కన్యాకుమారి kanya kumari వరకు కనెక్టివిటీని పెంచడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి kishan reddy అన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5వేల కి.మీ దాటిందని ఆయన చెప్పారు. జాతీయ రహదారుల నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయని చెప్పారు.