అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | తెలంగాణ (Telangana)లో మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది.
కాగా.. క్యూలైనల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డు స్థానాలు.. అనంతరం సర్పంచ్ ఓట్లు (Sarpanch Votes) లెక్కిస్తున్నారు. సర్పంచ్ ఫలితాలను ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నిక (Deputy Sarpanch Election) చేపడతారు. కాగా.. మూడో దశలో మొత్తం 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.