అక్షరటుడే, డిచ్పల్లి : Telangana University | అదుపు తప్పి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ (Telangana University Vice Chancellor) కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. డిచ్పల్లి నుంచి నిజామాబాద్‌కు (Nizamabad) వచ్చే దారిలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యూనివర్సిటీ వీసీకి చెందిన కారు డిచ్పల్లి (Dichpalli) నుంచి నిజామాబాద్ వస్తోంది. అయితే మాధవనగర్ బైపాస్ వద్ద కారుకు ముందున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో తప్పించే ప్రయత్నంలో కారులో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో వీసీ యాదగిరిరావు లేరు డ్రైవర్ ఒక్కరే ఉన్నారు. అయితే ఆయనకు సైతం ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.