అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | వంటల్లో నాణ్యత లేని వస్తువులు వాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్లో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి నాసిరకం వస్తువులను తీసుకొచ్చి వంటల్లో వాడుతున్నారని ఆరోపించారు. దీంతో తాము తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana University | ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో..
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లోని (Old Boys Hostel) మెస్ స్టోర్లో పూర్తిగా నాసిరకమైన వస్తువులే ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకుల అండతోనే ఈ వ్యవహారం నడుస్తోందని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, వార్డెన్, ప్రిన్సిపాల్ ధర్నా స్థలానికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.
