HomeతెలంగాణTelangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ కళాశాల విద్యార్థులకు సెమినార్​ నిర్వహించారు. తెయూ సెమినార్​ హాల్​లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్​ న్యాయమూర్తులు నరసింహాచార్యులు, జీవీ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు చట్టాలపై, పన్నులపై వేర్వేరుగా అవగాహన కల్పించారు.

భూ సంబంధిత, పన్నుల చట్టాల అమలులో తలెత్తే సమస్యలు వాటి పరిష్కారాలను సులువుగా అర్థమయ్యేలా న్యాయ విద్యార్థులకు (law students) వివరించారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్, హెచ్​వోడీ ప్రసన్నరాణి, బి స్రవంతి, ఛైర్మన్​ జెట్లింగ్ ఎల్లోసా, నాగజ్యోతి, న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.