Telangana University South Campus | శాస్త్రవేత్తల సహకారంతో స్కిల్ యూనివర్సిటీకి దీటుగా డెవలప్​ చేయాలి : రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి
Telangana University South Campus | శాస్త్రవేత్తల సహకారంతో స్కిల్ యూనివర్సిటీకి దీటుగా డెవలప్​ చేయాలి : రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana University South Campus | శాస్త్రవేత్తల సహకారంతో స్కిల్ యూనివర్సిటీస్​కు దీటుగా విద్యార్థులకు ఉత్తమ కోర్సులపై శిక్షణ ఇవ్వాలని రిటైర్డ్ ఐఏఎస్ చక్రపాణి సూచించారు.

తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణాన్ని గురువారం (సెప్టెంబరు 18) విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి సందర్శించారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యాపకులతో మాట్లాడారు. ఉన్నత విద్యా లక్ష్యాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని technology అందిపుచ్చుకుని విశ్వవిద్యాలయాలు చురుకైన పాత్ర పోషించాలన్నారు.

Telangana University South Campus | నూతన సర్టిఫికెట్ కోర్సులు

గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు నూతన సర్టిఫికెట్ కోర్సులను అందించాలన్నారు.  ప్రతిష్ఠ్మాత్మకమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని, శాస్త్రవేత్తల scientists సహకారంతో స్కిల్ యూనివర్సిటీస్​కు దీటుగా అభివృద్ధి చెందాలన్నారు.

సమాజంలో జరుగుతున్న సాంఘిక మార్పులను విద్యార్థులకు తెలియజేచేసి మార్పు తీసుకురావాలని సూచించారు. విద్యతో పాటు ఇంటర్షిప్​ internship పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు.

పూర్వ విద్యార్థుల సహకారంతో విశ్వవిద్యాలయాలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. చక్రపాణి సూచనలను పాటించి మరింత ముందుకెళ్తామని, భవిష్యత్తులో విశ్వవిద్యాలయానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్​లు డా.యాలాద్రి, డా.సునీత, విమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, apro డా.సరిత పిట్ల, అధ్యాపకులు డా.అంజయ్య, డా.మోహన్ బాబు, డా.హరిత, డా.ప్రతిజ్ఞ, డా.నాగరాజు, డా.నారాయణ, డా.నిరంజన్, శ్రీకాంత్, దిలీప్, డా.శ్రీమాత తదితరులు పాల్గొన్నారు.