అక్షరటుడే, ఇందూరు: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ (TVV) లో 2012 నియామకాలపై హైకోర్టు High Court తుది తీర్పు వెలువర్చింది.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012వ సంవత్సరం నియామకాలు చెల్లవంటూ తాజాగా హైకోర్టు High Court ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana University | మరో నోటిఫికేషన్..
తెవివి (TVV) లో పోస్టుల భర్తీ కోసం 2012లో జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ మరో కొత్త నోటిఫికేషన్లు జారీ చేసుకోవచ్చని కోర్టు సూచించింది.
తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో 45 మందికి పైగా ప్రొఫెసర్లు professors ఉద్యోగాలు కోల్పోనున్నారు. కాగా, 2012లో 91 పోస్టులకు నోటిఫికేషన్ notification విడుదల చేశారు.
