70
అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిసెంబర్-2026 విద్యా సంవత్సరం బీపీఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ (exam fee notification) విడుదలైనట్లు పరీక్షల నియంత్రణ అధికారి కె.సంపత్ కుమార్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
Telangana University | డిసెంబర్ లోపు..
బీపీఎడ్ ఒకటో, మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులుకు, బ్యాక్లాగ్ పరీక్ష ఫీజును డిసెంబర్ 27వ తేదీలోపు చెల్లించాలన్నారు. అలాగే రూ.100 పెనాల్టీతో డిసెంబర్ 29వ తేదీలోపు చెల్లించాలని నిబంధన విధించారు. విద్యార్థులు పూర్తి వివరాలకు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో (Telangana University website) సంప్రదించాలని తెలియజేశారు.