అక్షరటుడే, వెబ్డెస్క్ : Kurnool Bus Accident | కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బస్సు ఒక బైక్‌ను ఢీకొట్టి దాదాపు 300 మీటర్ల దూరం లాక్కెళ్లడంతో ఘోరం చోటుచేసుకుంది.
అధికారుల పరిశీలనలో బస్సులో పలు సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత హైదరాబాద్‌లో (Hyderabad) రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీస్‌లు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ తనిఖీలు చేపట్టారు. డ్రంకన్ డ్రైవ్ (Drunk and Drive), బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్ పత్రాలు, బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. పర్మిట్ లేకుండా నడుస్తున్న బస్సులపై కేసులు నమోదు చేసి, కొన్ని వాహనాలను సీజ్ చేశారు.
Kurnool Bus Accident | ఆర్టీఏ తనిఖీలు..
కూకట్‌పల్లి, హయత్‌నగర్, ఎల్బీనగర్ (LB Nagar) ప్రాంతాల్లో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లను తనిఖీ చేసి, లైసెన్స్ లేకుండా నడుపుతున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. వాహనాలపై ఉన్న చలాన్లను వసూలు చేసి, చెల్లించిన తర్వాతే వాహనాలను పంపించే విధంగా చర్యలు చేపట్టారు. భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో ఆరు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల భద్రతా ప్రమాణాలు, వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ల అనుభవాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తారు. భద్రతా ప్రమాణాలు పాటించని బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
కర్నూలు ఘటనకు సంబంధించి.. రవాణా శాఖ ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన హెచ్చరిక జారీ చేసింది. మొత్తం మీద, కర్నూలు ఘటన తర్వాత తెలంగాణలో (Telangana) రవాణా శాఖ అప్రమత్తతను పెంచి, భద్రతా తనిఖీలను వేగవంతం చేసింది. ప్రజల భద్రత కోసం చర్యలు కొనసాగుతున్నాయి.
