107
అక్షరటుడే, హైదరాబాద్: Telangana Tourism | తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది.
రెండో రోజైన మంగళవారం పర్యాటక రంగానికి రూ.7,045 కోట్ల పెట్టుబడి నిబద్ధతలు (Investment Commitments) దక్కడం విశేషం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో దేశ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు.
Telangana Tourism | ప్రత్యక్షంగా.. పరోక్షంగా..
తెలంగాణ రాష్ట్రానికి పర్యాటక రంగానికి వచ్చిన పెట్టుబడుల ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు చెబుతున్నారు. అంటే ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా ముప్పై వేల మందికి ఉపాధి లభించనున్నట్లు పేర్కొంటున్నారు.