అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phones Recovery | ఒకప్పుడు సెల్‌ఫోన్ Cell Phone పోయిందంటే.. దానిపై ఆశలు వదిలేసుకునే వాళ్లం. కొత్త ఫోన్ కొనుగోలు చేసేవాళ్లం. కానీ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చి సీఈఐఆర్ పోర్టల్ ceir portalతో పోయిన ఫోన్లు మళ్లీ చేతికి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్లు రికవరీ చేస్తుండగా.. అందులో తెలంగాణ telangana అగ్రస్థానంలో ఉంది. ఈ పోర్టల్ ఉపయోగించి ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు telangana police 78,231 ఫోన్లు స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
Phones Recovery | హైదరాబాద్‌లోనే అధికం
సెల్ఫోన్ల రికవరీలో హైదరాబాద్ కమిషనరేట్ hyderabad Commissionerate అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ కమిషనరేట్ పరిధిలో 11,879 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్లో 10,385, రాచకొండ కమిషనరేట్లో 8,681 ఫోన్లు రికవరీ చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐడీ డీజీ శిఖా గోయల్ సీఐడీ అధికారులను అభినందించారు.
Phones Recovery | ఫోన్ల దొంగలకు చుక్కలే..
గతంలో రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లామంటే ఫోన్‌పై ఓ చేయి వేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గుంపులో దొంగలు చేతివాటం ప్రదర్శించి ఫోన్ మాయం చేసేవారు. గ్రామాల్లోని వారసంతల నుంచి మొదలు పెడితే నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల వరకు ఈ సమస్య ఉండేది. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఆదమరిస్తే ఫోన్ దొంగలు రెచ్చిపోయేవారు. బస్సు, ట్రెయిన్ ఎక్కేటప్పుడు ఫోన్లు లాక్కొని పారిపోయేవారు. అయితే సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చాక సెల్‌ఫోన్ దొంగల పప్పులు ఉడకడం లేదు. ఫోన్లు కొట్టేసినా.. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వెంటన్ బ్లాక్ చేస్తున్నారు. అనంతరం దానిని రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు.
Phones Recovery | ఇలా ఫిర్యాదు చేయాలి
సెల్‌ఫోన్ పోతే వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో లాగిన్ అయి ఫిర్యాదు చేయాలి. లేదంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లికూడా ఫిర్యాదు చేయొచ్చు. దీని కోసం ఫోన్ ఐఎంఈఐ imei నంబర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన రశీదు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫోన్ పోగానే ఆ రశీదు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు సీఈఐర్ పోర్టల్ ద్వారా వెతికి పట్టుకుంటారు. తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 3,37,610 ఫోన్లు బ్లాక్ చేశారు. అందులో 1,88,279 ఫోన్లను గుర్తించారు. 78,231 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.