Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collectorate | కలెక్టరేట్​లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన

Kamareddy Collectorate | కలెక్టరేట్​లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన

కామారెడ్డి కలెక్టరేట్​లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ శనివారం స్థలపరిశీలన చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collectorate | కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) స్థలాన్ని పరిశీలించారు.

అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్​అండ్​బీ ఈఈ మోహన్ అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించి, పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను (Telangana Thalli statue) ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం రూ.5.80 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు.