9
అక్షరటుడే, హైదరాబాద్: Telangana TET Results | తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET-2026) ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. టెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్సైట్లో హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
Telangana TET Results | ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు..
రాష్ట్రంలో టెట్ కోసం 2,37,754 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,95,181 (82 శాతం) మంది పరీక్ష రాశారు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు 90.27 మంది హాజరయ్యారు. జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఎప్పుడైనా విడుదల చేస్తామని తెలుపగా.. అనుకున్న విధంగా ఫలితాలను సర్కారు ప్రకటించింది.