Telangana temperature rise | వర్షాలు బంద్​.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana temperature rise | బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలు (Rains) ముగిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులుగా తేలిక పాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. పలు పంటలకు ఈ వర్షాలు మేలు చేయగా.. మరికొన్ని పంటలకు నష్టం చేశాయి. ముఖ్యంగా ఆరబెట్టిన పసుపు, శనగ తడిసిపోవడంతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana temperature rise | బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలు (Rains) ముగిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పలు జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులుగా తేలిక పాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. పలు పంటలకు ఈ వర్షాలు మేలు చేయగా.. మరికొన్ని పంటలకు నష్టం చేశాయి. ముఖ్యంగా ఆరబెట్టిన పసుపు, శనగ తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరి, మొక్కజొన్న వంటి పంటలకు నీరు అవసరం అయిన సమయంలో వర్షాలు ఆదుకున్నాయని పలువురు అన్నదాతలు పేర్కొంటున్నారు.

Telangana temperature rise | మండనున్న ఎండలు

రాష్ట్రంలో బుధవారం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అయితే వర్షాలు కురిసే అవకాశం లేదు. పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయి. గురువారం నుంచి ఎండలు మండనున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28 తర్వాత తీవ్రమైన వేడి పరిస్థితులు ఉంటాయి. మార్చి 2 నుంచి 7 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తూర్పు, ఉత్తర తెలంగాణలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 37 డిగ్రీల టెంపరేటచర్​ దాటుతుందని అధికారులు తెలిపారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Inter Exams in Nizamabad | ప్రశాంతంగా ఇంటర్​ పరీక్షలు ప్రారంభం

అక్షరటుడే, ఇందూరు: Inter Exams in Nizamabad | జిల్లావ్యాప్తంగా ఇంటర్​ పరీక్షలు (Inter Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి...

IDFC first Bank fraud case | ఐడీఎప్​సీ ఫస్ట్​ బ్యాంక్​లో రూ.590 కోట్ల మోసం.. నలుగురి అరెస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IDFC first Bank fraud case | ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​లో రూ.590 కోట్ల భారీ మోసం వెలుగు చూసింది....

Hyderabad Police | నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య...

Inter Exams Begin | ఇంటర్​ పరీక్షలు ప్రారంభం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Exams Begin | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్​ ​పరీక్షలు (Inter Exams) ప్రారంభం అయ్యాయి. ఫస్టియర్​ విద్యార్థులు ఉదయం 9...