HomeతెలంగాణTGS RTC | రేవంత్ సర్కారు మ‌రో కీలక నిర్ణయం.. అతి త్వరలో ఆర్టీసీ బస్సుల్లో...

TGS RTC | రేవంత్ సర్కారు మ‌రో కీలక నిర్ణయం.. అతి త్వరలో ఆర్టీసీ బస్సుల్లో వైఫై సౌకర్యం..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: TGS RTC | తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress government) కొత్త ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూ ముందుకు సాగుతోంది. ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని హమీ ఇచ్చింది. దీనిలో భాగంగా అధికారంలోకి వచ్చిన అనంతరం మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)ను ఇంప్లిమెంట్ చేసింది. దీనిలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్(RTC Express), ఆర్టీనరీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించారు. ఈ సదుపాయాల‌కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ సర్కారు(CM Revanth government) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

TGS RTC | ఇక నుంచి వైఫై కూడా ఫ్రీ..

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న టీజీఎస్​ ఆర్టీసీ(TGSRTC).. ఇక మీదట బస్సులో ప్రయాణించే వారికి వైఫై సేవలు అందుబాటులో తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. బస్సుల్లో ప్రయాణించేవారికి వై-ఫై సదుపాయాన్ని(Wi-Fi access) అందించే విషయంపై ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఇటీవల ఆర్టీసీకి ప్రతిపాదనలు అందాయి. సచివాలయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆర్టీసీ, ఆర్టీఏపై సమీక్షా సమావేశంలో ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు ఈ విషయంపై పవర్​ పాయింట్​ ప్రజంటేషన్ ఇచ్చారు. బస్సులు, బస్టాండ్లు, రవాణాశాఖ కార్యాలయాలలో ఈ సదుపాయాన్ని అందిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.

ఇంటర్నెట్‌ యాక్సెస్‌ లేకుండా అప్‌లోడెడ్‌ కంటెంట్‌ను వై-ఫై WIFI ద్వారా మొబైళ్లలో చూసే అవకాశాన్ని కల్పిస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అంటే ముందే ఎంపిక చేసిన సినిమాలు, పాటల జాబితా మాత్రమే చూడడానికి వీలుంటుంది. మధ్యమధ్యలో వాణిజ్య ప్రకటనలూ వస్తుంటాయి. ఈ యాడ్స్‌తో ఆ సంస్థకు ఆదాయం ఉంటుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయ‌ట‌. త్వరలో ఆ సంస్థ, ఆర్టీసీ అధికారుల మధ్య ఈ విషయమై మరో సమావేశం జరగనుంది. ఆ తర్వాత ఈ విషయంపై స్పష్టత వస్తుందని తెలిసింది. మిగతా బస్సులు, బస్టాండ్లలో ఈ సదుపాయం కల్పిస్తామని ఢిల్లీ సంస్థ ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలో తెలంగాణ ఆర్టీసీ బస్సులలో(Telangana RTC Buses) ఉచిత నెట్ కూడా అందుబాటులో వస్తుందని చెప్పుకొవచ్చు.