అక్షరటుడే, ఇందూరు: State Finance Commission | తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య, ముగ్గురు సభ్యుల బృందం శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది.
రోడ్లు భవనాల అతిథి గృహం వద్ద ఛైర్మన్‌కు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai chaitanya), రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ (State Cooperative Union Limited) ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా స్థితిగతులపై చర్చించారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.