Homeజిల్లాలునిజామాబాద్​BC Reservations | 14న తెలంగాణ రాష్ట్ర బంద్​

BC Reservations | 14న తెలంగాణ రాష్ట్ర బంద్​

బీసీ రిజర్వేషన్లపై స్టే విధించడాన్ని నిరసిస్తూ 14న తెలంగాణ రాష్ట్ర బంద్​ నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పోస్టర్లను ఆవిష్కరించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ.. 14న తెలంగాణ రాష్ట్ర బంద్​ (Telangana state bandh) నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్​ తెలిపారు.

ఈ మేరకు నాందేవ్​వాడలోని బీసీ భవన్​లో (BC Bhavan) బంద్​కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం (National BC Welfare Association) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బంద్​ నిర్వహించనున్నట్లు తెలిపారు. బంద్​ను విజయవంతం చేయాలని బీసీ సంఘాలకు, ప్రజా సంఘాలకు, పాఠశాలలు, కళాశాలలను కోరారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగనన చేపట్టి బీసీలకు 42శాతం రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ కొంతమంది కావాలని పనిగట్టుకొని కేసులు వేసి స్టే తెచ్చారన్నారు. రెడ్డి జాగృతి పేరుమీద బీసీలు అభివృద్ధి చెందొద్దని హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి రూ.కోట్లు ఖర్చుపెట్టి బీసీల రిజర్వేషన్లను అడ్డుకోవడం సిగ్గుచేటని ప్రతాప్​ పేర్కొన్నారు. 14న స్వచ్ఛందంగా ప్రతిఒక్కరూ బంద్​లో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్, శ్రీను శ్రావణ్, కరిపే రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.