అక్షరటుడే, హైదరాబాద్: Telangana Rising Global Summit | తెలంగాణ Telangana రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను డిసెంబరు 7, 8వ తేదీల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమ్మిట్‌కు అంతర్జాతీయ కంపెనీల (international companies) ను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి Chief Minister Revanth Reddy ఢిల్లీ బయల్దేరారు. గురువారం (నవంబరు 13) ఢిల్లీలో ఇండో – యూఎస్ స్ట్రాటజిక్ ఫోరమ్ Indo-US Strategic Forum సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ సీఎం రేవంత్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సదస్సులో గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా.. 30 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
వీరందరినీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఈ సదస్సులో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
Telangana Rising Global Summit | అంబాసిడర్‌గా మెస్సీ..
అర్జెంటీనా స్టార్ Argentine star, ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ famous football player Lionel Messi డిసెంబర్లో భారత్ రాబోతున్నారు.
ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ Hyderabad ను కూడా సందర్శించనున్నారు. “ది గోట్ (జీఓఏటీ) ఇండియా టూర్ 2025″ లో భాగంగా మెస్సీ భాగ్యనగరానికి వస్తున్నట్లు తెలిసింది.
కాగా, తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ కార్యక్రమానికి మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం.
