అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Municipal Election Results | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.
నల్గొండ జిల్లా (Nalgonda District) హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీలు హస్తగతం అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, డోర్నకల్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ (Sultanabad Municipality)లో కాంగ్రెస్ గెలుపొందింది. భట్టి విక్రమార్క ఇలాకా మధిర మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ జెండా ఎగిరింది.తొర్రూరు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 16 వార్డులకు 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలవగా.. 6 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ములుగు, నేరేడుచర్ల, హుజూర్నగర్, డోర్నకల్, బాన్సువాడ, బిచ్కుంద (Bichkunda)లో కాంగ్రెస్ గెలుపొందింది. తొర్రూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. తిరుమలగిరి మున్సిపాలిటీని సైతం గులాబీ పార్టీ గెలుచుకుంది. మొత్తం 15 వార్డులకు గాను 8 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
Telangana Municipal Election Results | ఫార్వార్డ్ బ్లాక్ కైవసం
జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) వడ్డేపల్లిలో అనుహ్యంగా ఫార్వార్డ్ బ్లాక్ విజయం సాధించింది. 8 వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో వార్డు సాధించాయి. ఇంత వరకు బీజేపీ ఖాతా తెరవకపోగా.. ఫార్వార్డ్ బ్లాక్ విజయం సాధించడం గమనార్హం. ఫార్వార్డ్ బ్లాక్‌కు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. పలువురు జాగృతి కార్యకర్తలు ఆ పార్టీ తరఫున బరిలో దిగారు. కాగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ చరిత్రలో తొలిసారి ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు. ఒకటో వార్డులో 102 ఓట్ల మెజారిటీతో గెలిచిన ట్రాన్స్‌జెండర్ సుధాకర్ గెలుపొందారు.