అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Municipal Election Results | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. మెజారిటీ మున్సిపల్ పీఠాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. పలు చోట్ల కౌంటింగ్ పూర్తి కాగా.. కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
పెద్దపల్లి మున్సిపాలిటీ (Peddapalli Municipality)ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 36 వార్డుల్లో 27 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కో స్థానంలో గెలుపొందగా.. ఫార్వర్డ్ బ్లాక్ 5 స్థానాలకు గెలుచుకోవడం గమనార్హం. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీ కంటే ఫార్వార్డ్ బ్లాక్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.
Telangana Municipal Election Results | హుజురాబాద్లో..
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy)కి షాక్ తగిలింది. హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 30 వార్డుల్లో కాంగ్రెస్-16, బీఆర్ఎస్-8, బీజేపీ-5, ఇండిపెండెంట్-1 చోట గెలుపొందారు.
Telangana Municipal Election Results | ఉమ్మడి ఖమ్మంలో..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ (Congress) క్లీన్ స్వీప్ చేసింది. ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. కొత్తగూడెం నగర పాలక సంస్థ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో సైతం హస్తం జోరు కొనసాగింది. 1, 3, 4, 6, 7, 9, 11, 12వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, బీజేపీ ఒక్క వార్డులను గెలుచుకున్నాయి.