అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Municipal Election Results | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections)కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో తొలి రౌండ్ ఫలితాలు విడుదల అయ్యాయి.
ఇబ్రహీంపట్నం 4, 11 వ వార్డుల్లో బీఆర్ఎస్ (BRS) విజయం సాధించింది. ఆలియాబాద్ ఏడో వార్డులో ఇండిపెండెంట్, నర్సాపూర్ ఏడో వార్డులో కాంగ్రెస్, ధర్మపురిలో 1, 13 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నందికొండ 9వ వార్డు, ఖమ్మం జిల్లా మదిర 10వ వార్డులో టీడీపీ గెలుపొందింది. యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ (BJP) అభ్యర్థి బోడ రాధ విజయం.
Telangana Municipal Election Results | బీఆర్ఎస్ విజయం
ఇబ్రహీంపట్నం 12వ వార్డులో 100 ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ కుమార్ గెలిచారు. 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత, మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో, రామాయంపేట 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి, సంగారెడ్డి జిల్లా (Sangareddy District) గడ్డ పోతారంలో నాలుగు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 1, 2 వార్డుల్లో గెలిచింది.
మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3, బీజేపీ ఒక వార్డుల్లో గెలిచాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 52 వార్డుల్లో, బీఆర్ఎస్ 25, బీజేపీ 11 స్థానాల్లో విజయం సాధించాయి.