అక్షరటుడే, కామారెడ్డి: Telangana Minister Azharuddin | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి, మంత్రి అజారుద్దీన్(Minister Azharuddin) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డులలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
Telangana Minister Azharuddin | సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రిపీట్ కావాలి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉందన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నారని తెలిపారు. గత సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా రిపీట్ కావాలని, చేతి గుర్తుకు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
అహంకారం వీడితేనే అభివృద్ధి సాధ్యం: షబ్బీర్ అలీ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali) మాట్లాడుతూ అహంకారం వీడితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. ఎమ్మెల్యేగా వెంకట రమణా రెడ్డి (MLA Venkata Ramana Reddy) గెలిచినప్పటి నుంచి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. గతంలో ఏమీ చేయని వ్యక్తి రేపు చేస్తాడనే నమ్మకం ప్రజలకు లేదని తెలిపారు. అధికార గర్వం, ఇద్దరు సీఎంలను ఓడించానని చెప్పుకోవడం తప్ప, కామారెడ్డి కోసం ఆయన సాధించిన ఘనత ఒక్కటీ లేదని విమర్శించారు. అధికార అహం నెత్తికెక్కితే చిన్న, పెద్ద అనే వ్యత్యాసం ఉండదని, కేసీఆర్ అంతటి వాడే తన అహంకారంతో నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. వార్డులోని ప్రతి సమస్యను తమ ఇంటి సమస్యగా భావించి పరిష్కరించే వారికే ప్రజలు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.